నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లెజెండ్ చిత్రం ప్రస్తుతం బ్యాంకాక్ లో
షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాను మార్చి 28 న విడుదలకు ప్లాన్ చేస్తున్నాడు.
అయితే ఈ సినిమా పై ఇప్పటికే అటు అబిమానుల్లో , ఇటు సిని వర్గాల్లో
తీవ్రమైన ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు కుడా భారీగానే
ఉన్నాయి. ఈ సినిమాతో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి బాలయ్య రెడీ
అవుతున్నడన్నా సంగతి తెలిసిందే. అందుకోసం ఈ సినిమాకు సంబందించిన కొన్ని
ముఖ్య మైన వాటిలో నిర్ణయం బాలయ్యే తీసుకుంటున్నాడని తెలిసింది. వచ్చే
ఎన్నికలకు దగ్గరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తే అప్పుడు మంచి కిక్ ఉంటుందని
బాలయ్య ప్లాన్ వేసాడు. ఈ మూవీ ఆడియో ఫంక్షన్ కూడ మార్చి 9న జరపాలని,
బాలయ్య ముహర్తం పెట్టినట్టు సమాచారం. ప్రతి విషయాన్ని చాలా కేర్ తో
చేస్తున్నాడని ఫిలిం నగర్ లో వినిపిస్తుంది. ఈ వ్యవహారం బట్టి చూస్తే
బాలయ్య పొలిటికల్ ఎంట్రీ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు తెలుస్తోంది.
Post a Comment