Mahesh Looking EXtraordinary
మే నెల స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న సందడి చూస్తుంటే, అభిమానులకు నిజంగా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నట్లుగా ఉంది. ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా వరుసగా పోస్టర్స్ , అప్ డేట్స్, సాంగ్ ప్రోమో, లిరికల్ సాంగ్, విషెస్ పోస్టర్, మేకింగ్ వీడియో.. ఇలా రోజుకో పేరు చెప్పి కొత్త కొత్తగా ప్రమోషన్స్ చేస్తూనే ఉంది బ్రహ్మోత్సవం టీమ్. ఇప్పుడు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న కీలకమైన రోజు రానే వచ్చేసింది.
బ్రహ్మోత్సవం ఆడియో విడుదల కోసం మహేష్ అభిమానులు ఎప్పటినుంచో వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. సినిమా గురించిన సంగతులు, రిలీజ్ డేట్ కబుర్లను సూపర్ స్టార్ నోటి వెంట వినచ్చన్నది వాళ్ల ఆశ. ఇప్పుడు ఆడియో రిలీజ్ పోస్టర్ కూడా వచ్చేసింది. ఈ పోస్టర్ లో మహేష్ బాబును చూస్తే.. ఎవరికైనా సరే కళ్లు అదరాల్సందే. అంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు మహేష్. అది కూడా కలర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ ముందు మహేష్ ఇలా కనిపించడంతో మరింత మెరిసిపోతున్నాడు.
ఖాళీ బ్యాక్ గ్రౌండ్ లో కేరక్టర్ ని కలర్ ఫుల్ గా చూపించడం వేరు. కానీ ఈ పోస్టర్ లో మహేష్ బాబు వెనుకే బోలెడన్ని కలర్స్ ఉన్నాయి. అన్నిటి ముందు కూడా బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ టీషర్ట్ – ఖాకీ ఫ్యాంట్ – వైట్ షూస్.. చెప్పడానికి సింపుల్ గా ఉన్నా.. ఆ డ్రసింగ్ లో మహేష్ ఒక రేంజ్ లో హైలెట్ అవుతున్నాడు. దటీజ్ మహేష్.